
మొన్నేం జరిగింది? నిన్న ఎలా గడిచింది? అనే దాన్ని బట్టి రేపటి మీద అంచనాలు రేగుతుంటాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ ఈ లెక్కలు బాగానే నడుస్తున్నాయి. ఒన్ ఇండియా ఒన్ సినిమా అనే కాన్సెప్ట్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో నార్త్ హీరోలు సౌత్ ప్రమోషన్లకు ఎంత వరకు సహకరిస్తున్నట్టు? ఈ టాపిక్‌తో సైఫ్‌కి సంబంధం ఏంటి? తారక్ ఫ్యాన్స్ కి టెన్షన్ ఎందుకు? సౌత్ సినిమాలో సైఫ్ అనే మాట ఈ మధ్య బాగా స్ప్రెడ్ అయింది. రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్, ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఆదిపురుష్ అని న్యూస్ వచ్చినప్పుడు వావ్ అనిపించింది. అయితే సినిమా రిలీజుకు ముందు జరిగిన ప్రమోషన్లలో రాముడే కనిపించారు. జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి. సైఫ్ జాడేది అంటే ఏదీ అంటూ చెవులు కొరుక్కున్నారు. ప్రమోషన్లకు ఎందుకు రారంటూ ఓపెన్‌గానే మాట్లాడుకున్నారు.
తీరా సినిమా విడుదలయ్యాక కూడా రావణాసురుడి కేరక్టర్ మీదే బోలెడన్ని డౌట్స్ రెయిజ్ అయ్యాయి. రావణాసురుడి హెయిర్ స్టైల్ అలా ఉంటుందా? రావణ బ్రహ్మ పదితలలు అలాగే ఉంటాయా? ఆయన పాలించిన లంక ఇలా ఉందేంటి? అంటూ ప్రతిదీ ప్రశ్నే. దానికి తోడు సైఫ్ ఎందుకు సినిమాను ప్రచారం చేయలేదనే క్వశ్చన్ కంటిన్యూ అయింది.
ఆదిపురుష్ రిజల్ట్ తో సంబంధం లేకుండా, సైఫ్‌ని దేవరలో సెలక్ట్ చేసుకున్నారు కొరటాల. ఈ సినిమా షూటింగ్‌కి ఆల్రెడీ అటెండ్ అయ్యారు నార్త్ స్టార్. డైరక్టర్‌తోనూ, హీరో ఎన్టీఆర్‌తోనూ కార్డియల్ రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం ఫొటోలు బట్టి అర్థమవుతూనే ఉంది.
అయితే మళ్లీ ప్రీవియస్ డౌట్సే ఇక్కడా కంటిన్యూ అవుతున్నాయి. దేవర ఓపెనింగ్‌కి సైఫ్ హాజరు కాలేదు. ఆయన పేరు సర్‌ప్రైజ్‌గా ఉంచారనే అనుకున్నా, రిలీజ్ టైమ్‌లో అయినా ప్రమోషన్లకు హాజరవుతారా? అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్యాన్ ఇండియన్ సినిమాలకు నార్త్ ప్రమోషన్లలో, అక్కడివారి ప్రెజెన్స్ మస్ట్. కేజీయఫ్ విషయంలో సంజయ్‌దత్ ప్రెజెన్స్, స్పీచ్ చాలా హెల్ప్ అయ్యాయి. మరి అలాంటి సహకారం దేవరకు సైఫ్ నుంచి అందుతుందా? ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇండియన్ మూవీస్ అద్భుతంగా ఎస్టాబ్లిష్ కావడం గురించి తారక్, సైఫ్ మాట్లాడుకున్నట్టు వార్తలొచ్చాయి. ప్రమోషన్ల విషయంలోనూ ఇద్దరికీ మంచి క్లారిటీ ఉందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. రిలీజ్ టైమ్‌లో అది మెటీరియలైజ్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అప్పుడే దేవరకు ఉత్తరాదిన బంపర్ బజ్ క్రియేట్ అవుతుందన్నది వారి మనసుల్లో మాట.