సౌత్ సినిమాతో మింగిల్ అవ్వాలనుకుంటున్న నార్త్ బ్యూటీస్, హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు, అవసరమైతే స్పెషల్ సాంగ్స్‌లో నటించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నార్త్ బ్యూటీస్ మన సినిమాల్లో స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ టాప్ హీరోయిన్, సౌత్‌తో సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమాలో ఆడి పాండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై సుయ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ టైమ్‌లో స్పెషల్ సాంగ్ అలియా ఓకె చెప్తారా.? అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి. ప్రజెంట్ సౌత్ హవా చూస్తే అలియా ఓకే చెప్పే ఛాన్సే ఎక్కువగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే జరిగితే నార్త్‌లో కంగువా బిజినెస్‌కు కూడా హెల్ప్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.