
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా అఖిల్ కు హిట్ ఇస్తుందేమో అని చాలా ఆశపడ్డారు. ఊహించని విధంగా ఏజెంట్ సినిమా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఓపినింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. టాక్ మాత్రం మిక్స్డ్ గా వస్తోంది. అఖిల్ కష్టం వృధా అయ్యిందని అంటున్నారు చూసిన ప్రేక్షకులు. చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసిమీదున్న అఖిల్ ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేస్తున్నారని ఆసక్తికర చర్చ మొదలైంది. ఏజెంట్ సినిమా రిజల్ట్ తో అఖిల్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు అఖిల్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి అని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే వారసుడు సినిమాతో హిట్ అందుకున్న వంశీ అఖిల్ కు ఒక కథను వినిపించాడట. కథ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో అఖిల్ సినిమా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.