
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.. చివరిగా డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అఖండ 2. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు మరోసారి బాలయ్య కోసం పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నాడు గోపిచంద్ మలినేని. కాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలయ్య, గోపిచంద్ మలినేని సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా బాలయ్యతో కలిసి స్టెప్పులేస్తోందని టాక్. తమన్నా ఇప్పటికే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇక ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులేయనుంది తమన్న. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.