Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా.. ఆ స్టార్ హీరో సరసన లేడీ పవర్ స్టార్.?

|

Dec 08, 2022 | 4:13 PM

తొలి సినిమాతోనే తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి చాలా నేచురల్..

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందిగా.. ఆ స్టార్ హీరో సరసన లేడీ పవర్ స్టార్.?
Sai Pallavi
Follow us on

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. మలయాళ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి చాలా నేచురల్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిదా సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణిస్తోంది. అలాగే తమిళ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ షో చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఆకట్టుకుంది సాయి పల్లవి. చివరిగా గార్గి సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తోంది. సాయి పల్లవి బాలీవుడ్ లో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే హిందీలో ఈ అమ్మడు నటించే సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాయి పల్లవి హిందీలో నటించే సినిమాలో సీత పాత్ర చేస్తుందని తెలుస్తోంది. అల్లు అరవింద్ రామాయణ నేపథ్యంలో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతగా కనిపించనుంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు గా కనిపించనున్నాడు. ఈ సినిమాను మించి ఉండేలా అల్లు అరవింద్ రామాయణంను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడు పాత్రలో, హృతిక్ రోషన్ రావణుడిగా చేస్తారని టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి