AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Manchu: ఆ హీరోతో ఏడాదికొక సినిమా చేయాలనుంది.. మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు

Lakshmi Manchu: ఆ హీరోతో ఏడాదికొక సినిమా చేయాలనుంది.. మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Manchu Lakshmi
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2022 | 12:26 PM

Share

ప్రొడ్యూసర్ గానే కాకుండా అడపాదపా సినిమాల్లో నటించి అలరిస్తున్నారు మంచు లక్ష్మీ. సినిమాలతోపాటుగానే పలు షోలు కూడా హోస్ట్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ నటించిన సినిమా మాన్ స్టర్. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ మూవీలో మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపించరు. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు వైసక్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు మంచు లక్ష్మి ..ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు అని అన్నారు.

అలాగే మలయాళంలో నటిస్తున్నప్పుడు భాష పరంగా ఇబ్బందులు పడ్డాను. ఆ డైలాగ్స్ మనలా ఉండవు, చాలా లెంగ్తీ డైలాగ్స్ ఇచ్చారు. నేను చాలా ఎనర్జిటిక్ గా సెట్స్ కు వెళ్తే, డల్ గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది అన్నారు. ఇక మోహన్ లాల్ ఒక లెజెండరీ నటుడు. ఆయన నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఇప్పటికీ తన కెరీర్ లో చాలెంజింగ్ మూవీస్ చేస్తున్నారు. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలని ఉందని నేను ఆయనతో అన్నాను. కెరీర్ లో ఇప్పుడు ఆయన ఉన్న స్జేజ్ లో నాకెందుకు ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ ఆయన సవాళ్లు స్వీకరిస్తారు.

నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని అన్నారు. అదేవిధంగా ట్రోల్స్ ను, మీమ్స్ ఎంజాయ్ చేస్తుంటా.. వాళ్లకు ఇంకేదేనా కొత్తగా క్రియేట్ చేసేందుకు క్లూ ఇవ్వాలని చూస్తుంటా.. నటిగా కంటే టీవీ కార్యక్రమాల్లో నన్ను నేనుగా ప్రేక్షకులకు చూపించుకోగలుగుతాను. ప్రస్తుతం గాంబ్లర్, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం తదితర చిత్రాల్లో నటిస్తున్నాను అని తెలిపారు మంచు లక్ష్మీ.

ఇవి కూడా చదవండి
Follow Us
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?