AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram: ఉస్తాద్ ఓపెనింగ్‌కు పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ అందుకే రాలేదా…?

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓపెనింగ్ కు త్రివిక్రమ్‌కు ఆహ్వానం అందలేదా.. లేదంటే దర్శక నిర్మాతలతో ఏదైనా ఇష్యూ ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Trivikram: ఉస్తాద్ ఓపెనింగ్‌కు పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ అందుకే రాలేదా...?
Ustaad Bhagat Singh Movie Opening Photo
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2022 | 9:32 PM

Share

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓపెనింగ్ కు త్రివిక్రమ్ ఎందుకు రాలేదు..? అదేం ఇష్యూ కాదు.. రావాలని రూల్ ఏం లేదుగా అనుకోవచ్చు..? కానీ సినిమాల పరంగా త్రివిక్రమ్ లేకుండా పవన్ ఏం చేయరనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. పైగా గురూజీకి ఇప్పుడు షూటింగ్ కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు రాలేదు..? త్రివిక్రమ్‌కు ఆహ్వానం అందలేదా.. లేదంటే దర్శక నిర్మాతలతో ఏదైనా ఇష్యూ ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  చాలా మందిలో ఇప్పుడున్న అనుమానం ఇదే. ఎందుకంటే పవన్ సినిమా వేడుక ఏది జరిగినా.. దర్శక నిర్మాతలు ఎవరైనా.. అక్కడ త్రివిక్రమ్ కచ్చితంగా కనిపించాల్సిందే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్‌లో మాత్రం గురూజి లేరు. దాంతో పవన్, త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. అయితే దీనికి బలమైన కారణాలు వేరేవి చాలానే ఉన్నాయి.

ఉస్తాద్ ఓపెనింగ్‌కు త్రివిక్రమ్‌ రాకపోవడానికి హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్‌తో ఉన్న ఇష్యూసే కారణమని తెలుస్తుంది. గతంలో మైత్రి మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్న త్రివిక్రమ్.. తనకున్న బిజీ కారణంగా కమిట్‌మెంట్ పూర్తి చేయలేదు. దాంతో వడ్డీతో కలిపి అడ్వాన్స్‌ తిరిగిచ్చారు. అక్కడ్నుంచే మైత్రితో త్రివిక్రమ్‌కు డిస్టర్బెన్సెస్ మొదలయ్యాయని టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అలాగే హరీష్ శంకర్‌తోనూ త్రివిక్రమ్‌కు ఇష్యూ ఉందనే ప్రచారం ఉంది. వినోదియ సితం రీమేక్ తన బ్యానర్‌లో చేయాలనుకున్నారు త్రివిక్రమ్. అదే సమయంలో పవన్ కోసం హరీష్ శంకర్ కథ సిద్ధం చేసారు. త్రివిక్రమ్ రాకతో హరీష్ సినిమా ఆలస్యమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ రీమేక్ ఆగిపోగానే.. ఆయన్ని ఉద్దేశించి హరీష్ శంకర్ కొన్ని ట్వీట్స్ చేసి డిలీట్ చేసారని.. ఆ మనస్పర్థలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది.

ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మధ్య కూడా గ్యాప్ వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్‌ను కాదని.. డిజే కోసం అల్లు అర్జున్ వైపు హరీష్ వెళ్లడంతో పవన్‌తో ఈయనకు గ్యాప్ వచ్చింది. అయితే ఆ తర్వాత అంతా సెట్టైంది. అయితే మైత్రి మూవీ మేకర్స్, హరీష్‌ శంకర్‌తో ఇష్యూస్ కారణంగా త్రివిక్రమ్‌కు పవన్ సినిమా ఆహ్వానం అందలేదని.. అందుకే ఆయన రాలేదని తెలుస్తుంది. మరి ఈ గ్యాప్ ఎప్పటికి ఫిల్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..