23 ఏళ్ల కెరీర్‌.. చేసినవి 27 చిత్రాలు.. మహేష్ జర్నీలో ఒక్క రీమేక్ కూడా లేదు.. ఎందుకో తెలుసా.?

Mahesh Babu Guntur Kaaram Movie: మహేష్ బాబు నటించిన చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే.. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌లు, మెసేజ్ ఓరియెంటెడ్ ఒరిజినల్ కథలే ఉంటాయి. రీమేక్ చిత్రాలకు ఆమడదూరంలో ఉంటాడు మహేష్. ఆల్రెడీ చెప్పేసిన కథలను, ఒకరు చేసిన పెర్ఫార్మెన్స్‌లను మరోసారి రిపీట్ చేయడం మహేష్ బాబుకు అస్సలు ఇష్టముండదు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అందుకే రీమేక్ చిత్రాలకు..

23 ఏళ్ల కెరీర్‌.. చేసినవి 27 చిత్రాలు.. మహేష్ జర్నీలో ఒక్క రీమేక్ కూడా లేదు.. ఎందుకో తెలుసా.?
Mahesh Babu

Updated on: Aug 09, 2023 | 7:27 PM

చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో చాలామంది రీమేక్ చిత్రాలు చేసినవారే. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తన సినీ కెరీర్‌లో ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు. ఈ విషయం చాలామంది ఫ్యాన్స్‌కి తెలిసే ఉండొచ్చు. కానీ మహేష్ రీమేక్ సినిమాలు చేయకపోవడం వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ పెద్దగా తెలియకపోవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఆ తర్వాత ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

మహేష్ బాబు నటించిన చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే.. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌లు, మెసేజ్ ఓరియెంటెడ్ ఒరిజినల్ కథలే ఉంటాయి. రీమేక్ చిత్రాలకు ఆమడదూరంలో ఉంటాడు మహేష్. ఆల్రెడీ చెప్పేసిన కథలను, ఒకరు చేసిన పెర్ఫార్మెన్స్‌లను మరోసారి రిపీట్ చేయడం మహేష్ బాబుకు అస్సలు ఇష్టముండదు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు లేకపోలేదు.

రీమేక్‌లు చేయకపోవడం వెనుక కారణమిదే..!

‘అప్పటికే రిలీజైన ఓ సినిమా చూసి.. తర్వాత సెట్స్‌పైకి వెళ్తే.. అందులో ఆ హీరోనే కనిపిస్తాడు. అంతేకాదు.. ఆ హీరోలా చేయాలా.? లేదా మనలా యాక్టింగ్, మ్యానరిజమ్స్ చేయాలా అనే కన్ఫ్యూజన్‌లో పడిపోతాను. అందుకే చాలావరకు రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటానని మహేష్ బాబు చెప్పారు. అయితే తాను రీమేక్‌లు చేయనని.. కానీ తన సినిమాలు వేరే హీరోలు రీమేక్ చేయాలని అనుకుంటానని ఆయన తెలిపారు.

మాస్ లుక్‌లో మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుక.. ఆయన నటిస్తోన్న కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి మరో లుక్ రిలీజ్ అయింది. పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పోస్టర్ మహేష్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ లేదా లిరికల్ సాంగ్ ఏదైనా వస్తుందని ఊహించుకున్న ఫ్యాన్స్‌కు కేవలం.. పోస్టర్ మాత్రం మహేష్ బాబు పుట్టినరోజు నాడు రిలీజ్ కావడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ‘గుంటూరు కారం’ విడుదల తేదీలో కూడా మార్పు చేశారు మేకర్స్.. అనుకున్న జనవరి 13 కన్నా.. ఒక్క రోజు ముందుగానే 2024 జనవరి 12న థియేటర్లలోకి రానుంది. కాగా, ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ దర్శకుడు.

మరిన్ని సినిమా వార్తల కోసం…