జగ్గూ భాయ్‌కి ఆఫర్స్ ఎందుకు తగ్గాయ్..?

|

Dec 17, 2019 | 9:29 PM

జగపతిబాబుని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఆ ఫేజ్‌లో కేవలం డబ్బులు కోసమే చాలా సినిమాలో చెేశాను అని బహిరంగంగా చెప్పాడు ఈ సీనియర్ నటుడు. ఇక బాలయ్య సినిమా ‘లెజెండ్’ లో విలన్ గా నటించి ఇరగదీశాడు జగ్గూ భాయ్. టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా వరస సినిమాలతో దుమ్మరేపాడు. ఆపై తండ్రి పాత్రలతో పాటు సహనటుడిగానూ సత్తా చాటాడు. స్లోగా […]

జగ్గూ భాయ్‌కి ఆఫర్స్ ఎందుకు తగ్గాయ్..?
Follow us on

జగపతిబాబుని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఆ ఫేజ్‌లో కేవలం డబ్బులు కోసమే చాలా సినిమాలో చెేశాను అని బహిరంగంగా చెప్పాడు ఈ సీనియర్ నటుడు. ఇక బాలయ్య సినిమా ‘లెజెండ్’ లో విలన్ గా నటించి ఇరగదీశాడు జగ్గూ భాయ్. టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా వరస సినిమాలతో దుమ్మరేపాడు. ఆపై తండ్రి పాత్రలతో పాటు సహనటుడిగానూ సత్తా చాటాడు.

స్లోగా తన మార్కెట్‌ను తమిళ, మలయాళ సినిమాలకు విస్తరించాడు. అదేంటో తెలియని కానీ రీసెంట్‌గా జగ్గూ భాయ్‌కి అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మహేశ్‌బాబు..  ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా కోసం ఓ కీ రోల్‌లో మొదట జగపతిబాబును తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్లేసులోకి ప్రకాశ్ రాజ్ వచ్చేశాడు. దీనిపై కాస్త ఇబ్బందిపడుతూనే వివరణ ఇచ్చాడు ఈ స్టైలిష్ విలన్.

కాగా ఆ మూవీ తర్వాత నుంచే జగపతిబాబుకు అవకాశాలు తగ్గాయని ఫిలిం సర్కిల్‌ టాక్ జోరందుకుంది. అసలు సైరా తర్వాత ఈ క్రేజీ నటుడు ఏ మూవీలో నటించబోతున్నారని ఇప్పటివరకు క్లారిటీ లేదు. మహేశ్ మూవీకి నో చెప్పడం వల్లే ఈ సినియర్ హీరో దూరమయ్యడే..లేక పర్సనల్‌గానే ఏమైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడా తెలియలాంటే జగ్గు భాయ్ నోరు విప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.