
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం అట్టహాసంగా జరిగింది. గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతో పాటు నూతన గృహప్రవేశం కూడా చేశారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ విందు భోజనాలు కూడా పెట్టించారు. ఇదే శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు విజయ్. తన సొంతూరి మూలాలను మర్చిపోకుండా తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇస్తామని ప్రకటించాడీ రౌడీ హీరో. ఇక ఇవాళ (మార్చి 04) విజయ్- రష్మికల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ జరగనుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సొంతూరి నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు విజయ్ -రష్మిక. కాగా రిసెప్షన్ కు ముందు మంగళవారం (మార్చి 03) దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు కొత్త దంపతులు. ఈ సందర్భంగానే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్- రష్మిక.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘గీతగోవిందం’ చేస్తున్నప్పుడు మేము స్నేహితులు మాత్రమే. ‘డియర్ కామ్రేడ్’ చేస్తున్న టైంలో మా మధ్య ప్రేమ పుట్టింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్నాళ్లకు రష్మికనే నాకు లవ్ ప్రపోజ్ చేసింది’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన విరోష్ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌
A special day for all🫶🏽#Virosh
pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత చాన్నాళ్లకు మళ్లీ స్క్రీన్ పై జంటగా కనిపించనున్నారు విజయ్- రష్మిక. ప్రస్తుతం వీరిద్దరూ ‘రణబాలి’లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
Pics 😍✨️#ViRosh pic.twitter.com/Qk7yGKy3Ke
— Mona (@Randomstylish) March 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.