మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి
Ott Movie

Updated on: Sep 17, 2025 | 1:34 PM

హారర్ సినిమాల్లో చిత్ర విచిత్రమైన కంటెంట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటే అందులో మూడు నాలుగు సినిమాలు హారర్ జోనర్లే ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆంథాలజీ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ హారర్ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తుంది. ఈ సినిమాలో సీన్స్ చూస్తే భయంతో సుస్సూ పడటం గ్యారెంటీ.. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీ ప్రేక్షకులకు భయానికి గురి చేస్తాయి.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్‌కు లవర్‌గా.. హరికృష్ణకు కోడలిగా నటించిన ఏకైక హీరోయిన్.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా

సినిమా కథలోకి వెళ్తే.. ఒక యువతి ఎనోలా పెన్నీ ఒక పాత థియేటర్‌ చూసి ఆకర్షితురాలవుతుంది. ఒక రాత్రి, థియేటర్ తలుపు స్వయం తెరుచుకుంటాయి. ఆమె లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక భయానకమైన పప్పెట్ షో మొదలవుతుంది. పప్పెట్ హోస్ట్ పెగ్ పోయెట్ ఆమెకు ఆరు భిన్నమైన, భయానకమైన కథలు చెప్పడం మొదలుపెడతాడు. ఈ కథలు హారర్, డార్క్ ఫాంటసీ, గొర్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటాయి. చివరిలో, ఎనోలా ఈ అనుభవం నుంచి ఎలా బయటపడుతుందనేది ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఓ కథలో మనుషులను తినే వారి గురించి చూపిస్తారు. ఆ సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి : మిరాయ్‌లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.? అమ్మబాబోయ్ ఈమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా..

ఈ సినిమాలోని కథలన్నీ ప్రేక్షకులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.. ఈ సినిమా హారర్ ఫ్యాన్స్‌కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి – కొన్ని కథలు (ముఖ్యంగా “స్వీట్స్” మరియు “ది అక్సిడెంట్”) అద్భుతంగా ఉన్నాయని, కానీ మిగతావి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. IMDb రేటింగ్ 5.2/10. ఈ సినిమా పేరు ది థియేటర్ బిజార్. 2011లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాకి ఎనిమిది మంది డైరెక్టర్లు పని చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యుబిలో అందుబాటులో ఉంది. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి.

ఇది కూడా చదవండి : రెండుసార్లు ప్రేమలో పడింది.. ఇద్దరు పిల్లలకు తల్లయింది.. అప్పుడు తెలుగులో తోప్.. కానీ ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.