
చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్నవి చాలానే ఉన్నాయి. వాటిలో కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా ఒకటి. విలేజ్ రస్టిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా జులై 18న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఆమె గతంలో కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాల నిర్మాతగా, నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పించారు, గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మించారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆహాలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఆగస్టు 22న ఆహాలో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
Kothapalli పిలుస్తోంది! 🎬
Watch #KothapalliloOkappudu Premieres 22nd Aug only on #aha
(24hrs early access for Gold users)@RanaDaggubati @IamPraveenaP @SpiritMediaIN#KothapalliloOkappudu #RanaDaggubati #PraveenaParuchuri pic.twitter.com/IO08xuWGba— ahavideoin (@ahavideoIN) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి