సినిమా ఇండస్ట్రీలో హీరోల అభిమానుల మధ్య వివాదాలు మనం చూస్తూనే ఉంటాం.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తన్నుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. మనదగ్గరే కాదు తమిళ నాట అభిమానుల మధ్య గొడవలు ఎక్కువాగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్,తల అజిత్ అభిమానులకు మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తమిళనాట తమ్ముళ్ళ తన్నులాట కలకలం రేపుతోంది. చెన్నైలో విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ అల్లకల్లోలంగా మారింది. తమిళనాట మరోసారి ఫ్యాన్స్ రగడ రచ్చ రచ్చగా మారింది. వారసుడు సినిమా నిర్మాత …తమ హీరోని తక్కువ చేసి మాట్లాడారంటూ ఫ్యాన్స్ మధ్య గొడవ రచ్చ రంబోలాగా మారింది.
అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని నిర్మాత దిల్ రాజు అనడం తమిళనాడులో అగ్గిరాజేస్తోంది. దీన్ని మేము సహించబోమని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు కు అల్టిమేటం ఇచ్చారు. విజయ్ కన్నా మా హీరోనే మంచి నటుడంటూ అజిత్ ఫ్యాన్స్… ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది.
అయితే ఇది తమిళనాడులో నిత్య కృత్యమే. నిత్యం అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య రగడ రాజుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా పొంగల్ సందర్భంగా విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో కాంట్రవర్సీ కాకరేపుతోంది. తాజాగా దిల్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాట అభిమానుల మధ్య అగ్గిరాజుకుంటోంది.