ఈ రోజుల్లో ఓ సినిమా 30 రోజులు ఆడితేనే అద్భుతం.. అంతకు మించి ఆడితే చరిత్ర.. ఓటిటి రాజ్యమేలుతున్న రోజుల్లో ఓ సినిమా 200 రోజులు ఆడటం అనేది అసాధ్యం.. అలాంటిదిప్పుడు ఓ సినిమాకు ఏకంగా 200 రోజుల వేడుక చేసారు.. మరోవైపు ఇంకో సినిమాకు 100 రోజుల వేడుక జరిగింది. అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతుంది..? ఈ విచిత్రాలేంటి..?
ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు నిరాశ పరిచిన తర్వాత.. వాల్తేరు వీరయ్యతో నిజంగానే అభిమానులందరికీ అదిరిపోయే సక్సెస్ పార్టీ ఇచ్చేసారు చిరంజీవి. బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. రొటీన్ కథ అంటూ కొందరు పెదవి విరిచినా.. మెగా స్టామినా ముందు అవన్నీ నిలబడలేదు. తాజాగా ఈ సినిమా 200 రోజుల సంబరాలు చేసుకున్నారు మేకర్స్.
ఈ రోజుల్లో ఓ సినిమా 200 రోజులు ఆడటం అనేది అసాధ్యం. కానీ ఏపీలోని ఒక థియేటర్‌లో 200 రోజుల రన్ పూర్తి చేసుకుంది వీరయ్య. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు 200 రోజుల షీల్డ్ ప్రధానం చేసారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. 200 రోజుల వేడుక ఆనందంగా ఉందని.. ఇండస్ట్రీ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తుందని చెప్పారు. మరోవైపు దసరా సినిమాకు 100 రోజుల వేడుక జరిపారు మేకర్స్.
మార్చ్ 30న విడుదలైన దసరా సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి.. నాని కెరీర్‌లో మొదటి 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం. ఇప్పుడు 100 రోజుల వేడుక జరిపారు మేకర్స్. ఆ మధ్య వీరసింహారెడ్డికి కూడా ఘనంగా 100 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ రోజుల్లో 100, 200 రోజులు అంటే కష్టమే.. కానీ ఆ షీల్డ్ తీసుకోవడం వాళ్లకు ఆనందం. అందుకే ఒక్క థియేటర్‌లో ఆడినా.. ఆ వేడుక చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥
Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎
Spot the Standees at your nearest theatres,
Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻 pic.twitter.com/9l24d13CbX— Bobby (@dirbobby) December 16, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.