Deepika Padukone: ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‏కు బాలీవుడ్ బ్యూటీ.. దీపికకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..

|

Dec 04, 2021 | 7:45 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు చిత్రాలను కంప్లీట్ చేస్తూనే.

Deepika Padukone: ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‏కు బాలీవుడ్ బ్యూటీ..  దీపికకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు చిత్రాలను కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు కొత్త ప్రాజెక్టులను షూరు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల టాప్ డైరెక్టర్స్‏తో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇటీవలే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు డార్లింగ్. మరోవైపు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండగానే.. మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు ప్రభాస్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్క్ టైటిల్‏తో రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్టేడ్స్ కోసం ప్రభాస్ అభిమానులు నెట్టింట్లో చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హైదరాబాద్ చేరుకుంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంప్రదాయబద్దంగా స్వాగతాన్ని పలికింది. చీర, గాజులు, మల్లెపూలు, పసుపు, కుంకుమతో సంప్రదాయబద్దంగా దీపికకు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని వైజయంతీ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Upasana Kamineni Konidela: రెండు సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..

Manchu Vishnu: అచితూచి మాట్లాడండి.. ఇచ్చే స్టేట్‏మేంట్స్ ఇండస్ట్రీపై పడుతుంది.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..