Kurchi Tatha: కుర్చీతాత అరెస్టుకు అసలు కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన యూట్యూబర్

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు కుర్చీ తాత. . అలియాస్‌షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తోన్న ఈ కుర్చీతాత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబర్‌ కేసు పెట్టడంతోనే పోలీసులు అహ్మద్‌ పాషాను అదుపులోకి తీసుకున్నారు

Kurchi Tatha: కుర్చీతాత అరెస్టుకు అసలు కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన యూట్యూబర్
Kurchi Thata
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 2:02 PM

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు కుర్చీ తాత. . అలియాస్‌షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తోన్న ఈ కుర్చీతాత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబర్‌ కేసు పెట్టడంతోనే పోలీసులు అహ్మద్‌ పాషాను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ కుర్చీతాతపై కేసు పెట్టిందెవరో కాదు ఇన్నేళ్లుగా ఆయనకు సహాయం చేస్తున్న ఫేమస్‌ యూట్యూబర్ వైజాగ్‌ సత్యనే. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడు సత్య. కుర్చీతాత గురించి ఎవరికీ తెలియని నిజాలను బయటపెట్టాడు. ‘కుర్చీ తాత అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టే టైప్. మహేశ్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని పాటలో ఆయన డైలాగ్ పెట్టారు. దీంతో అహ్మద్‌ పాషాను నేనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి తీసుకెళ్లాను. తమన్‌తో మాట్లాడిన తర్వాతే ఈ డైలాగ్ సినిమాలో పెట్టుకున్నారు. ఇందుకోసం కుర్చీ తాతకు రూ.20 వేలు సాయం కూడా చేశారు’

గుంటురు కారం రిలీజ్‌ తర్వాత ఇదే సినిమా స్పూఫ్‌ కాన్సెప్ట్‌తో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేయించాను. వాళ్లు కూడా కుర్చీతాతకు రూ.5 వేలు ఇచ్చారు. అలా చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి, ఇవీ చేసుకుంటూ బాగానే సంపాదించుకున్నాడు. అక్కడితో ఆయన సంతోషంగా ఉన్నాడని అనుకున్నాం. అయితే కుర్చీతాతకు ఆశ మరీ ఎక్కువైంది. హీరో మహేశ్ బాబు దగ్గరికి నన్ను తీసుకెళ్లు. నాకు ఇల్లు ఇప్పించు, ప్లాట్ ఇ‍ప్పించు అని నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయనెందుకు నీకు ఇల్లు ఇస్తాడు అని నచ్చజెప్పి చూశాను. కానీ ఆయన నాపై పగబట్టాడు. నా మీద బ్యాడ్‌ వీడియోలు చేశాడు. సత్య ఒక దొంగ.. నా పేరుతో లక్షలు పోగేసుకుంటున్నాడు. వాడి కాలు తీసేస్తా.. వాడిని చంపేస్తా’ అంటూ పిచ్చి పిచ్చిగా వీడియోలు చేశాడు. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు స్టేషన్‌కు తీసుకెళ్లి బాగా కోటింగ్‌ ఇచ్చారు. ఇకపై ఆయనకు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని సత్య చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..