గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదారి, మెకానిక్ రాకీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. వీటిలో గామి విమర్శకుల ప్రశంసలు అందుకోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావవరి, మెకానిక్ రాకీ సినిమాలు పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో నే లైలా అంటూ మరో డిఫరెంట్ మూవీతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు విశ్వక్. లేడీ గెటప్ లో కనిపించడం, టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ప్రి రీలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కొన్నిపొలిటికల్ కామెంట్స్ తో ట్విట్టర్ లో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్ అయ్యింది. ఇలా రిలీజ్ కు ముందే వార్తల్లో నిలిచిన లైలా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు చ్చింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో త్వరగానే థియేటర్లలో నుంచి లైలా సినిమా మాయమైపోయింది. కాగా లైలా సినిమా కంటెంట్ పై కూడా విమర్శలు వచ్చాయి. చివరకు విశ్వక్ సేన్ కూడా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
థియేటర్లలో అభిమానులను నిరాశపర్చిన లైలా చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్నిప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. లెక్క ప్రకారం థియేటర్లలో రిలీజైన నెల రోజులకు అంటే మార్చి 2వ వారంలో లైలా స్ట్రీమింగ్ కు రావాలి. అయితే థియేటర్లలో దెబ్బ పడడంతో ఇప్పుడు తొలి వారంలోనే ఓటీటీలో రిలీజ్ అవకాశముందని సమాచారం. మార్చి 7న లేదా అంతకంటే ముందే లైలా ఓటీటీలోకి రావొచ్చని తెలుస్తోంది. బట్టల రామస్వామి బయోపిక్ సినిమాత ఆకట్టుకున్న రామ్ నారాయణ్ ఈ లైలా సినిమాను తెరకెక్కించాడు. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, రవి మారియా, నాగి నీడు, హర్ష వర్దన్, బ్రహ్మాజీ, రఘు బాబు, అభిమన్యు సింగ్, పృథ్వీ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు.
It is time for the ECHIPAAD ENTERTAINMENT in theatres 💥💥#Laila GRAND RELEASE TODAY ❤️🔥
Book your tickets now for the fun ride now!
🎟 https://t.co/ZAKt1MAQy9 pic.twitter.com/bUZKNcHGof— VishwakSen (@VishwakSenActor) February 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి