Vishal: ‘తెలియట్లేదు నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో’.. హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్..

భవతారిణి భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తీసుకురానున్నారు. అనంతరం అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి ఇళయారాజా బాటలోనే భవతారిణి గాయనిగా.. సంగీత దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాసయ్య సినిమాతో గాయనిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు భవతారిణి. ఆ తర్వాత తమిళం, మలయాళంలో అనేక పాటలు పాడారు. తమిళంలో 'భారతి' సినిమాలో 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకున్నారు.

Vishal: తెలియట్లేదు నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో.. హీరో విశాల్ ఎమోషనల్ ట్వీట్..
Vishal

Updated on: Jan 26, 2024 | 2:50 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతారిణి (47) క్యాన్సర్‏తో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కాలేయ క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడానికి శ్రీలంక తీసుకుంటున్న ఆమె.. గురువారం (జనవరి 25)న సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలుస్తోంది. భవతారిణి భౌతికకాయాన్ని ఈరోజు చెన్నైకి తీసుకురానున్నారు. అనంతరం అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి ఇళయారాజా బాటలోనే భవతారిణి గాయనిగా.. సంగీత దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాసయ్య సినిమాతో గాయనిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు భవతారిణి. ఆ తర్వాత తమిళం, మలయాళంలో అనేక పాటలు పాడారు. తమిళంలో ‘భారతి’ సినిమాలో ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకున్నారు. భవతారిణి మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

భవతారిణి మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని.. ఆమె మరణ వార్త విని తన హృదయం బరువెక్కిందంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు హీరో విశాల్. “ప్రియమైన భవతారిణి.. ఈ వార్త విని నా హృదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావు. నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకు కజిన్ గా కంటే ఎక్కువగా నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియడం లేదు. ఈ పరిణామాలు అన్ని నా జీవితాన్నే తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

భవతారిణి మృతిపై కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. తన గుండె నొప్పిగా ఉందని.. తన సోదరుడు ఇళయరాజాను ఎలా ఓదార్చాలో తెలియడం లేదంటూ ఎమోషనల్ అయ్యారు. భవతారిణి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాము. ఇది ఎప్పటికీ అంగీకరించలేని విషయం. భవతారిణి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కమల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.