Priya Prakash Varrier: మెంటలెక్కిస్తున్న వింక్ బ్యూటీ.. ప్రియా.. ఏమిటి నీ మాయ..
వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ లేటెస్ట్ ఫోటోలను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ అమ్మాడు చాలా హాట్ అని కామెంట్స్ పెడుతున్నారు.

ఒరు అదార్ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమానే సెన్సేషన్ కావటంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చెక్, ఇష్క్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. కానీ ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావటంతో అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. స్పెషల్ సాంగ్‌లో గ్లామర్ యాంగిల్ చూపించినా.. పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
బాలీవుడ్ అవకాశం కూడా ప్రియా ప్రకాష్‌కి పెద్దగా కలిసి రాలేదు. శ్రీదేవి బంగ్లా పేరుతో ప్రియా ప్రకాష్ నటించిన సినిమా దాదాపు మూడేళ్లుగా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్‌లో ఉంది. ఈ సినిమాలో శ్రీదేవి మరణాన్ని తప్పుగా చూపించారన్న విమర్శలు రావటంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
బిగ్ స్క్రీన్ మీద కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సోషల్ మీడియాలో స్పీడు పెంచారు వింక్ బ్యూటీ. వెకేషన్ టైమ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో జోరు చూపిస్తున్నారు. తన అందచందాలతో యూత్‌ను కట్టి పడేస్తుంది ఈ చిన్నది. కూల్ కూల్ వెదర్‌లోనూ హీట్ పెంచుతుంది. అందాల ప్రదర్శనకు ఎలాంటి హద్దులు లేవని డైరెక్ట్‌గానే చెబుతుంది. సోషల్ మీడియాను అయితే ఓ ఊపు ఊపేస్తుంది. ఈ జోష్ సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




