ఇర్ఫాన్ రుణం తీర్చుకున్న ఆ గ్రామ ప్రజలు…
అద్భుతమైన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న పేగు వ్యాధితో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, అభిమానులకి, యావత్ చిత్ర పరిశ్రమకే తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఇర్ఫాన్‌తో మంచి అనుబంధం ఉన్న ఇగత్ పురి గ్రామ ప్రజలు తమ ఊరి పేరు మార్చి ఇర్ఫాన్ రుణం తీర్చుకున్నారు. మహారాష్ట్రలోని ఇగత్‌పురి విలేజ్ లో ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఇర్ఫాన్.. ఎన్నో సేవా […]

అద్భుతమైన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29న పేగు వ్యాధితో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, అభిమానులకి, యావత్ చిత్ర పరిశ్రమకే తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఇర్ఫాన్‌తో మంచి అనుబంధం ఉన్న ఇగత్ పురి గ్రామ ప్రజలు తమ ఊరి పేరు మార్చి ఇర్ఫాన్ రుణం తీర్చుకున్నారు.
మహారాష్ట్రలోని ఇగత్‌పురి విలేజ్ లో ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఇర్ఫాన్.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. బుక్స్, కంప్యూటర్లు, రెయిన్ కోట్స్, పిల్లలకు స్వెటర్లు పంచి పెట్టడంతో పాటు పలు పండుగలను సైతం వారితోనే కలిసి జరుపుకున్నారు. ఆయన గ్రామానికి చేసిన సేవలని మదిలో నింపుకున్న అక్కడి ప్రజలు ఇర్ఫాన్ మరణం తర్వాత..తమ గ్రామానికి హీరో -చీ- వాడీ అని పేరు పెట్టుకున్నారు. అంటే మరాఠీలో నైబర్ హుడ్ హీరో. ఇర్ఫాన్ ఖాన్ గురించి ఇగత్‌పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బోడ్కే మాట్లాడుతూ.. మా గ్రామానికి పదేళ్లుగా సేవలంధిస్తూ వస్తోన్న ఇర్ఫాన్ మాకు ఓ సంరక్షుడిలా మారిపోయారు. ఏ అవసరం వచ్చిన వెంటనే ముందుకు వచ్చేవారు. సాయం చెయ్యడంలో ఎప్పుడూ ముందుండేవారు. అలాంటి వ్యక్తి లేని వెలితిని పూడ్చటం కష్టం. అందుకే మా హృదయాలలో ఇర్ఫాన్ ఎప్పటికీ నిలిచిపోవాలని ఊరు పేరు మార్చాం అని గోరఖ్ చెప్పారు.




