ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం..న‌టుడు మృతి

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం..న‌టుడు మృతి

వ‌రుస మ‌ర‌ణాలు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్(44)‌ మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌తో పోరాటం చేస్తున్న ఆయ‌న సోమ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణ‌ వార్త విని మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురైంది. ఆయ‌న‌కి కుటుంబానికి తీవ్ర సానుభూతి ప్ర‌కటిస్తూ చిత్ర పరి‌శ్ర‌మ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా సందేశాలు పంపుతున్నారు. ముల్లా మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన‌ జ‌యేశ్…. ‘ప్రేత‌మ్ 2’, ‘క్రేజీ గోపాలం’, […]

Ram Naramaneni

|

May 12, 2020 | 3:28 PM

వ‌రుస మ‌ర‌ణాలు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు క‌ళాభ‌వ‌న్ జ‌యేశ్(44)‌ మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌తో పోరాటం చేస్తున్న ఆయ‌న సోమ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణ‌ వార్త విని మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురైంది. ఆయ‌న‌కి కుటుంబానికి తీవ్ర సానుభూతి ప్ర‌కటిస్తూ చిత్ర పరి‌శ్ర‌మ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా సందేశాలు పంపుతున్నారు.

ముల్లా మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన‌ జ‌యేశ్…. ‘ప్రేత‌మ్ 2’, ‘క్రేజీ గోపాలం’, ‘సుసు సూది వాల్మీకం వంటి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ క‌ళ‌లో కూడా ఈ న‌టుడుకి ప్రావీణ్యం ఉంది. క‌ళాభవ‌న్ జ‌యేశ్‌కి భార్య‌ సునాజా.. ఓ బాబు ఉన్నారు. రెండేళ్ళ క్రితం అత‌ని మ‌రో కుమారుడు క‌న్నుమూయ‌డం..ఇప్పుడు జ‌యేశే కాలం చేయ‌డంతో వారి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu