Andhra Pradesh: అవసరాన్ని బట్టి కొందరు తమ తమ స్థాయిలో ఫైరవీలు చేయడం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులైతే.. ఎన్నికల్లో టికెట్ కోసం ఫైరవీలు చేయడం చూశాం. వ్యాపారవేత్తలు కాంట్రాక్టుల కోసం ఫైరవీలు చేయడం చూశాం. ఇలా రకరకాలు ఫైరవీలు గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ, ప్రభుత్వంలో కీలక పొజీషన్‌లో ఉండి.. సినిమా టికెట్లు కోసం థియేటర్ల యాజమాన్యాలకు లేఖ రాసి అడగం ఎప్పుడైనా చూశారా?.
వివరాల్లోకెళితే.. కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ థియేటర్ యాజమాన్యాలను విజయవాడ మేయర్ కోరారు. కోరడమంటే మాట వరసకు కాదండోయ్.. అధికారికంగా లేఖ కూడా రాశారు. ఈ లేఖ.. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు పంపించారు. ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ‘‘విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో ప్రతి నెల కొత్త చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల కోసం టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందువల్ల కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి 100 టికెట్లు ఇవ్వండి. ఆ టికెట్లకు డబ్బు కూడా చెల్లించడం జరుగుతుంది. తదుపరి విడుదల కానున్న సినిమాల నుంచి వీటిని ఏర్పాటు చేయండి.’’ అని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి సినిమా థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also read:
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!
High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!