AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీం తీర్పుతో నా 20 ఏళ్ల కల నెరవేరింది: విజయశాంతి

ఆర్మీలో మహిళలకు.. పురుషులతో సమాన హోదా కల్పిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ తెలిసిందే. అయితే ఈ తీర్పుకి సంబందించి కీలక కామెంట్స్..

సుప్రీం తీర్పుతో నా 20 ఏళ్ల కల నెరవేరింది: విజయశాంతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 19, 2020 | 2:33 PM

Share

ఆర్మీలో మహిళలకు.. పురుషులతో సమాన హోదా కల్పిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ తెలిసిందే. అయితే ఈ తీర్పుకి సంబందించి కీలక కామెంట్స్ చేశారు ప్రముఖ నటి విజయశాంతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా.. ఓ ట్వీట్ చేశారు. ‘ఐపీఎస్ అధికారిగా, లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, సీబీఐ అధికారిగా, మహిళా మంత్రిగా, ఆటోడ్రైవర్‌గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తగా, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమ కారిణిగా… ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అసంఖ్యాక పాత్రలతో మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం సుదీర్ఘమైన.. నా సినీ ప్రయాణం 1979 నుంచి.. ఇప్పటి వరకూ ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు నాకు లభించింది.

వీటిలో నేను నటించి, అందరి ఆదరణ పొందిన బహుభాషా చిత్రం ‘భారతరత్న’. ఈ సినిమాలో నేను పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను ఆర్మీ ఆఫీసర్‌గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటూ’ ఆమె ట్వీట్ చేశారు.

Follow Us
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..
పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట
పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట
పొలంలో ఎన్నిసార్లు బోరు వేసినా నీరు పడటం లేదని ఈ రైతు ఏం చేశాడంటే
పొలంలో ఎన్నిసార్లు బోరు వేసినా నీరు పడటం లేదని ఈ రైతు ఏం చేశాడంటే
మన దేశంలో మ్యాచ్..కానీ హోస్ట్ మాత్రం అఫ్గాన్.. ఇది కదా ట్విస్ట్
మన దేశంలో మ్యాచ్..కానీ హోస్ట్ మాత్రం అఫ్గాన్.. ఇది కదా ట్విస్ట్
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!
కాక్రోచ్‌ల నిరసన ఎఫెక్ట్.. విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు!