Vijay Thalapathy : మాములు బ్యాగ్రౌండ్ కాదు భయ్యా.. విజయ్ దళపతి ఆస్తులు ఎన్ని కోట్లంటే.. లైఫ్ చూస్తే మతిపోద్ది..
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్నాళ్లు హీరోగా అలరించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నటిస్తూన్న చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రాన్ని తెలుగులో జన నాయకుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సంపాదన గురించి నెట్టింట తెగ వైరలవుతుంది.

దక్షిణాది స్టార్ హీరోలలో విజయ్ దళపతి ఒకరు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో వరుస సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. విభిన్న కంటెంట్ చిత్రాలను అలరిస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. సామాజిక సేవ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన చివరగా నటిస్తున్న సినిమా జన నాయగన్. సంక్రాంతి జనవరి 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ప్రస్తుతం తమిళనాడులో వెట్రీ కజగం (TVK) పేరుతో పార్టీ స్థాపించారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా జన నాయగన్. ఈ క్రమంలోనే విజయ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తు్న్నారు. విజయ్ చెన్నైలోని బీచ్‌సైడ్ విలాసవంతమైన భవనం విలువ దాదాపు రూ. 80 కోట్లు ఉంటుందని సమాచారం. ఇంటీరియర్‌లు ఆధునిక డిజైన్, తక్కువ శబ్ధం కలిగి ఉంటాయి. ఈ ఇల్లు అధునాతన భద్రతా వ్యవస్థలు, ఆటోమేటెడ్ లైటింగ్, ఫ్యూచరిస్టిక్ స్మార్ట్-హోమ్ టెక్నాలజీతో తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
విజయ్ గ్యారేజీలో రూ. 6 కోట్లకు పైగా విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ. 95 లక్షల ధర కలిగిన BMW X5 , దాదాపు రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ ఉన్నాయి. నివేదికల ప్రకారం విజయ్ ఆస్తుల విలువ రూ.500 కోట్లు ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
