
విజయ్ దళపతి.. సినీరంగంలో ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మాస్టర్, బీస్ట్, వారసుడు వంటి చిత్రాలతో ఇటీవల కాలంలో వరుస విజయాలను అందుకున్నారు. ఈరోజు విజయ్ దళపతి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే విజయ్ లైఫ్ స్టైల్, అతడి ఆస్తులు, ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్, కార్ కలెక్షన్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీకు విజయ్ సంపాదన గురించి చెప్పబోతున్నాము. విజయ్ చెన్నైలో సముద్రతీర ప్రాంతంలో విలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్నారు. నీలంకరాయ్‌లోని కాసువారినా డ్రైవ్ స్ట్రీట్‌లో అతడి ఇళ్లు ఉంది.
ఇక 2019 నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోలలో ఒకరు. ఆయన సంవత్సరానికి రూ.120 కోట్లు సంపాదిస్తారట. అలాగే సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి కోట్లు తీసుకుంటారు. ఒక్కో యాడ్ చేయడానికి విజయ్ రూ.10 కోట్లు తీసుకుంటారు. అలాగే అతడి ఆటోమొబైల్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పటివరకు అతడి గ్యారేజీలో హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. విజయ్ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 2.5 కోట్లు), రెండు BMW SUVలు, ఆడి A8 L (రూ. 1.17 కోట్లు) విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 65 లక్షలు), ఫోర్డ్ ముస్తాంగ్ (రూ. 74 లక్షలు), వోల్వో XC90 (రూ. 87 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ GLA (రూ. 87 లక్షలు) కార్లు సైతం ఉన్నాయట.
ఇక విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారని సమాచారం. అలాగే నివేదికల ప్రకారం ఇప్పటివరకు విజయ్ ఆస్తులు రూ.600 కోట్లు అని టాక్. . మూడు దశాబ్దాలకు పైగా కెరీర్ సాగిన విజయ్ 68 కి పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం విజయ్ వయసు 51 సంవత్సరాలు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..