Varasudu: విడుదలకు ముందు విజయ్‌ సినిమాకు షాక్‌.. వారసుడు కథ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు

గతంలో వచ్చిన బృందావనం, బ్రహ్మోత్సవం, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, మహర్షి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి తదితర సినిమాలను మిక్స్‌ చేసి వారసుడు సినిమాను తెరకెక్కించారంటూ నెట్టింట ట్రోల్స్‌ వస్తున్నాయి. ఇక పలు తమిళ్‌ వెబ్‌సైట్లు కూడా సినిమాలో కొత్త పాయింట్‌ ఏం​ లేదంటూ పాత చింతకాయ పచ్చడేనంటూ పలు కథనాలు రాసుకొస్తున్నాయి.

Varasudu: విడుదలకు ముందు విజయ్‌ సినిమాకు షాక్‌.. వారసుడు కథ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు
varasudu Movie

Updated on: Jan 10, 2023 | 5:34 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో తెలుగు వెర్షన్‌ను జనవరి 14కు వాయిదా వేసినట్లు దిల్‌రాజు తెలిపాడు. ఇదిలా ఉంటే వారసుడు సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. వ్యూస్‌ పరంగా రికార్డులు కొల్లగొడుతోంది. అదే సమయంలో చాలామంది వారసుడు సినిమా ట్రైలర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన బృందావనం, బ్రహ్మోత్సవం, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, మహర్షి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి తదితర సినిమాలను మిక్స్‌ చేసి వారసుడు సినిమాను తెరకెక్కించారంటూ నెట్టింట ట్రోల్స్‌ వస్తున్నాయి. ఇక పలు తమిళ్‌ వెబ్‌సైట్లు కూడా సినిమాలో కొత్త పాయింట్‌ ఏం​ లేదంటూ పాత చింతకాయ పచ్చడేనంటూ పలు కథనాలు రాసుకొస్తున్నాయి. అయితే వంశీ పైడిపల్లి సరికొత్త పాయింట్‌తో వారసుడు సినిమాను తెరకెక్కించారని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో విజయ్‌ తల్లిదండ్రులుగా శరత్‌ కుమార్‌, జయప్రద నటిస్తున్నారు. శ్రీకాంత్, శ్యామ్‌లు విజయ్‌ అన్న పాత్రలు పోషించారు. ఇక ప్రకాశ్‌ రాజ్‌ మెయిన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్‌గా రష్మిక విజయ్‌ సరసన రొమాన్స్‌ చేయనుంది. వీరితో పాటు ప్రభు, ఖుష్బూ, యోగిబాబు, సంగీత.. నందిని రాయ్‌, గణేశ్‌ వెంకట్రామన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ అందించిన స్వరాలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..