Vijay Sethupathi : విక్రమార్కుడుగా విజయ్ సేతుపతి.. ‘ఆహా’ లో మరో ఇంట్రస్టింగ్ మూవీ..

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి.ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు.

Vijay Sethupathi : విక్రమార్కుడుగా విజయ్ సేతుపతి.. ఆహా లో మరో ఇంట్రస్టింగ్ మూవీ..
Sethupathi

Updated on: Jul 06, 2021 | 4:06 PM

Vijay Sethupathi : విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి.ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు.ఇటీవల దళపతి మాస్టర్ సినిమాలో విలన్ గా నటించిన మక్కల్ సెల్వన్ ఆతర్వాత తెలుగు సినిమా ఉప్పెనలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. అయితే విజయ్ సేతుపతి నటించిన సినిమా ఒకటి ఇప్పుడు తెలుగులో రాబోతుంది. 2018లో సేతుపతి నటించిన ‘జుంగా’ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని ”విక్రమార్కుడు” పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ‘ది రియల్ డాన్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ‘అఖిల్’ బ్యూటీ సాయేషా సైగల్ – ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ‘ఆహా’ వారు ‘విక్రమార్కుడు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి ‘ఆహా’ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విజయాలను సాధించిన ఇతర భాషా చిత్రాలను కూడా డబ్బింగ్ రూపంలో అందిస్తోంది.

కాస్మోరా’ ఫేమ్ గోకుల్ ‘విక్రమార్కుడు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి సిద్దార్థ సంగీతం సమకూర్చారు. వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ – క్రాంతి కీర్తన పతాకాలపై కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ – అప్పసాని సాంబశివరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Induvadana: న్యూ లుక్ లో అదరగొడుతున్న వరుణ్ సందేశ్.. ”ఇందువదన” నుంచి లిరికల్ సాంగ్

Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

Ramachandrapuram Teaser : రక్తంతో తడిసిన “రామచంద్రపురం”.. వైవిధ్యభరితంగా టీజర్