Allu Arjun – Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌.. ఏం పంపించాడో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు క్రేజీ స్టార్స్. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ అల్లు అర్జున్‌కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట పంపాడు.

Allu Arjun - Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌.. ఏం పంపించాడో తెలుసా?
Allu Arjun, Vijay Deverakonda

Updated on: Apr 26, 2025 | 11:52 AM

టాలీవుడ్ రౌడీ బాయ్ గా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ వ్యాపారంలోనూ అదరగొడుతున్నాడు. రౌడీ బ్రాండ్ పేరుతో సెలెబ్రిటీలకు స్పెషల్ దుస్తుల్ని డిజైన్ చేస్తుంటాడు. ఈ రౌడీ వేర్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక రౌడీ బ్రాండ్లలో కొత్త డిజైన్లు వస్తే వాటిని ముందుగా అల్లు అర్జున్‌కే పంపిస్తుంటాడు విజయ్ దేవరకొండ. గతంలో పలు సార్లు తన రౌడీ వేర్స్ ను బన్నీకి పంపాడు విజయ్. ఆ మధ్యన ‘పుష్ప 2’ రిలీజ్‌ సందర్భంగా ‘పుష్ప’ పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు. తాజాగా విజయ్ దేవర కొండ తన రౌడీ బ్రాండ్‌ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఈ సందర్భంగా మరోసారి రౌడీ వేర్స్‌ను అల్లు అర్జున్ కు పంపించాడు విజయ్. ఈ విషయాన్ని ఐకాన్ స్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. విజయ్ తనకు పంపిన గిఫ్ట్స్ ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. ‘మై స్వీట్‌ బ్రదర్‌.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు. సో స్వీట్‌’ అని విజయ్ పై ప్రేమను కురిపించాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

కాగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో నూ ఓ సినిమా చేయనున్నాడు. ఇక విజయ్‌ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం ‘కింగ్‌డమ్‌’ సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ మధ్యే విజయ్ డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశాడు. ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేయాలనుకుంటున్నడు విజయ్. కింగ్ డమ్  చిత్రం తరువాత రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్టులోనూ విజయ్ నటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్..

 

Vijay Deverakonda Gifts

 

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో నెక్ట్స్ సినిమా .. హాలీవుడ్ రేంజ్ లో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.