రౌడీ బాయ్ గా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ తో అటు అనన్య టాలీవుడ్ కు.. ఇటు విజయ్ బాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గుంటూరులో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న మిమల్ని కలవాలని.. పెద్ద సినిమాతో వస్తున్నా.. ఈ రోజు ఇక్కడ మీతో మాట్లాడుతున్న అంటే మీరు ఇస్తున్న ప్రేమే కారణం.. ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడికి వెళ్లిన ప్రేమించారు, అది నేను మర్చిపోలేను.. నేను యాక్టింగ్ మానేసినా కూడా ఈ 20 రోజులు జరిగిన ఈవెంట్స్ ను మర్చిపోలేను.. మీకు గుర్తుండిపోయే సినిమాలు చేస్తా.. అందులో ఒక భాగం లైగర్. లీగర్ కథ విన్నప్పుడు.. మెంటల్ అనే మాట ఒక్కటే వచ్చింది. మనోళ్లు ఎంజాయ్ చేస్తారు త్వరగా ఈ సినిమా చేయాలి అని అనుకునేవాడిని. త్వరగా ఈ సినిమా మీముందుకు తీసుకురావాలని అనుకున్నా.. మరో 5 రోజుల్లో సినిమా రాబోతుంది. మన సినిమా కుమ్మేస్తుంది.. ఆగస్టు 25 గుంటూరు ను షేక్ చేయాలి.. ..