Vijay Deverakonda: ఆమె నన్ను చాలా భరించింది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Aug 16, 2022 | 7:11 AM

ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు.

Vijay Deverakonda: ఆమె నన్ను చాలా భరించింది..  విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Vijay
Follow us on

లైగర్(Liger) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. కరణ్ జోహార్, పూరి, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగాంగా మీడియాతో ముచ్చటించారు విజయ్.

విజయ్ మాట్లాడుతూ.. “యాక్టర్ అవ్వాలనుకున్నపుడు పెద్ద కలలు ఉండేవి. పెళ్లి చూపులతో ప్రయాణం చిన్నగా మొదలైయింది. అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రేమ పంచుతూనే వున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది లైగర్ తో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైయింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సమయంలో ఇక్కడ కాలేజీల్లో తిరుగుతుంటే మన పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. ఇదంతా మన థియేటర్లలోనే మొదలైయింది. లైగర్ పై మేము చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఇండియా షేక్ అవుతుంది. ఆగస్ట్ 25 మీ అందరికీ నచ్చే సినిమా, మీరంతా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం” అన్నారు

అలాగే.. డ్యాన్స్ అంటే నాకు ఏడుపోస్తుంటుంది. నేను డ్యాన్సర్ అని అనుకోను. కానీ లైగర్ కోసం డ్యాన్సులు చేశాను. ఇందులో అనన్య నన్ను చాలా భరించింది. డ్యాన్స్ టేక్ మధ్యలో కట్ చెప్పేస్తుంటా. నాకు సరిగ్గా వచ్చేసరికి ఆమెకు అలసట వచ్చేస్తుంటుంది. అనన్యతో వర్క్ చేయడం మంచి అనుభవం. అనన్య ముద్దు పిల్ల. సినిమా కోసం చాలా కష్టపడుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మైక్ టైసన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? అని అడగ్గా.. “ఆయనతో పని చేయడం లైఫ్ టైం గుర్తుపెట్టుకునే జ్ఞాపకం. మైక్ టైసన్ అంటే మా అమ్మ భయపడింది. సినిమా యాక్షన్ కోర్రియోగ్రఫీ గురించి తనకి తెలీదు. షూటింగ్ రోజు ఆయన్ని చూస్తే భయం వేసింది. ఆయనది మామూలు పర్శనాలిటీ కాదు. షేక్ హ్యాండ్ ఇస్తే పది కేజీల బరువు తాకినట్లు వుంటుంది. ఆయన మెడ మనకి మూదింతలు వుంటుంది. ఆయన షూ సైజ్ 16. ఎక్కడా దొరకలేదు స్పెషల్ గా తయారుచేశాం. క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ సీక్వెన్స్ వుంది. ఆయన రియల్ గా నటుడు కూడ కాదు. మొదట్లో చాల భయం వేసింది. అయితే ఆయన చాలా స్వీట్ పర్శన్. కథ చెప్పడమే టైసన్ రిఫరెన్స్ తో చెప్పారు. సినిమా చేస్తున్నపుడు ఆయన అయితేనే న్యాయం జరుగుతుందని ఏడాది పాటు కష్టపడి ఆయన్ని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాం. ఆయన పాత్ర లైగర్ లో చాలా కీలకం” అన్నారు.