Vijay Deverakonda: జీవితంలో ఆ మూడు చాలా ముఖ్యం.. కానీ ఎన్నో వదిలేశాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్..
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరు తమ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతుంటారని.. అలాంటి ప్రతి ఒక్కరు స్టార్ అని.. అందుకే విజయ్ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఆనందం, డబ్బు.. ఈ మూడు చాలా ముఖ్యమైనవని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) నిర్వహించిన హెల్త్ కార్డ్, డైరీ, ఐడీ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టులకు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అందరూ ఆనందంగా ఉంటారని అన్నారు. అలాగే జర్నలిస్టుల హెల్త్ కార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తన కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు తనతోనే ఉన్నారని.. కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని.. కానీ వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదని అన్నారు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదని.. . అలా ఎన్నో వదిలేశానని అన్నారు. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ ఉపయోగించుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించిందని… జీవితంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఆనందం, డబ్బు చాలా ముఖ్యమైనవని… ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికీ జర్నిలిస్టులతో సుదీర్ఘ ప్రయాణం చేస్తానని అన్నారు.
ఈ ఏడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించారు సినీ ప్రముఖులు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరు తమ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతుంటారని.. అలాంటి ప్రతి ఒక్కరు స్టార్ అని.. అందుకే విజయ్ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.