AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే.. వీడియో వైరల్..

ప్రస్తుతం కింగ్ డమ్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Jul 27, 2025 | 12:49 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సూరి పాత్రలో కనిపించనున్నారు విజయ్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాల కలయికతో ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బలమైన భావోద్వేగాలత నిండిన అద్భుతమైన కథను కింగ్ డమ్ సినిమాతో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 31న ఈ సినిమా భాహీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విజయ్ తోపాటు కింగ్ డమ్ సైతం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..