Kingdom Censor Review: ‘కింగ్‌డమ్’తో రౌడీ హీరో బౌన్స్ బ్యాక్… సెన్సార్ టాక్ రివ్యూ.. !

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ కాబోతుంది విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' చిత్రం. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి..

Kingdom Censor Review: కింగ్‌డమ్తో రౌడీ హీరో బౌన్స్ బ్యాక్... సెన్సార్ టాక్ రివ్యూ.. !
Vijay Devarakonda

Edited By: TV9 Telugu

Updated on: Jul 28, 2025 | 1:20 PM

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ ‘టాక్సీవాలా’ ‘గీతా గోవిందం’ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలిచాడు విజయ్ దేవరకొండ. అయితే అతనికి ఇటీవల వరస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్‌డమ్’ సినిమా చేశాడు. జూలై 31న వరల్డ్‌వైడ్ ప్యాన్‌ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.

విజయ్ ఇప్పటి వరకు ఎప్పుడూ టచ్ చేయని కొత్త జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ట్రయిలర్ రిలీజైకాక ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో గుండుతో కనిపించే విజయ్… జైలు సీన్స్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడట. అన్నా-తమ్ముల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంగా వచ్చే సీన్లు చాలా బాగా వచ్చాయట. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో విజయ్ కెమిస్ట్రీ కూడా హైలైట్ అవుతుందని సెన్సార్ వాళ్లు అభిప్రాయపడినట్టు సమాచారం.

యాక్షన్, హీరోయిజం, ఫ్యామిలీ డ్రామా అన్నీ సమపాళ్లలో కలిపి ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను తెరపై ఆవిష్కరించాడట గౌతమ్ తిన్ననూరి. జెర్సీ తరహాలో ఈ సినిమాకూ ఆయన హ్యుమన్ ఎమోషన్ టచ్ రంగరించారని టాక్. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఆల్రెడీ హైప్ పెంచగా… సినిమాటోగ్రఫీ విభాగంలో జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కలిసి విజువల్స్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారట. ఎడిటింగ్‌కు నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి సారథ్యం వహించడం కూడా సినిమాకు ఓ బోనస్.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం… ట్రయిలర్ విడుదలైన తర్వాత మరింత అంచనాలు పెంచనుంది.