vijay devarakonda : సుకుమార్ సినిమాకంటే ముందే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీ బాయ్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

vijay devarakonda : సుకుమార్ సినిమాకంటే ముందే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీ బాయ్
Vijay Devarakonda

Updated on: May 19, 2021 | 2:30 PM

vijay devarakonda: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ తర్వాత విజయ్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధిచిన వార్తలేమి బయటకు రాలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరగడం మొదలైంది. కాని ఆ వార్తలు నిజం కాదని పుష్ప తర్వాత సుకుమార్ చేయబోతున్న సినిమా రౌడీ స్టార్ తోనే అంటూ క్లారిటీ ఇచ్చారు.సుకుమార్ తో సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ లైగర్ తో సహా మూడు సినిమా లను చేయబోతున్నాడు.  వీటిలో ఒకటి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఉంది. అయితే ఈ మూడు సినిమాల తర్వాత సుకుమార్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇటీవలే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ravi Teja’s Khiladi: మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు .. ఓటీటీకి నో..

Kangana Ranaut: కరోనాను జయించిన కాంట్రవర్సీ క్వీన్.. పూర్తిగా కోలుకున్న కంగనా ..

Allu Arjun Pushpa Movie: రెండు భాగాలుగా బన్నీ పుష్ప.. భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ప్లాన్ చేస్తున్న మేకర్స్..