Liger Movie: లైగర్ అప్డేట్ వచ్చేసింది.. ఆసక్తికరంగా విజయ్ దేవరకొండ పోస్టర్..

Liger Movie Update: బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Liger Movie: లైగర్ అప్డేట్ వచ్చేసింది.. ఆసక్తికరంగా విజయ్ దేవరకొండ పోస్టర్..
Vijay Devarakonda New Look

Updated on: Jul 02, 2022 | 10:42 AM

Liger Movie Update: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో రాబోతున్న సినిమా లైగర్ (Liger). ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై భారీగా అంచనాలను పెంచిశాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్..

లైగర్ సినిమా నుంచి విజయ్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను  డిఫరెంట్ గా తయారు చేశారు. ఇందులో విజయ్ లుక్ సరికొత్తగా ఉంది. “నేను సర్వస్వం పెట్టి తీసిన సినిమా ఇది.. నటనలో, మానసికంగా, శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. త్వరలోనే మీకు అన్ని వివరాలు ఇచ్చేస్తాను” అంటూ ట్వీట్ చేశారు విజయ్ . లైగర్ కాకుండా ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ కాంబోలో జనగణమన సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో విజయ్ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే లేటేస్ట్ బజ్ ప్రకారం.. లైగర్, జనగణమన కాకుండా పూరి, విజయ్ కాంబోలో మరో మూవీ కూడా రాబోతుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ ట్వీట్..

ఛార్మి ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.