Vijay Devarakonda: ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’లో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అనంతరం నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో అతిథి పాత్రలో నటించి ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆకర్షించాడు. ఇక ‘పెళ్లి చూపుల్లో’ తనదైన నటనతో ఆకట్టుకున్న విజయ్… ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఈ సినిమా విజయంతో యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ విజయ్ వైపు చూసింది.
ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో విజయ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఎలాంటి బ్రాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారాడు. ప్రస్తుతం రూ. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ బడా హీరోలకు సైతం సవాలు విసురుతున్నాడు. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రౌడీ వేర్ పేరుతో వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాడు. తనదైన ప్రమోషన్‌తో ఈ బ్రాండ్‌ను యూత్‌లోకి తీసుకెళ్లాడు విజయ్. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నాడు. వస్త్ర వ్యాపారంలో ఉన్న విజయ్ ఈసారి థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన విజయ్.. మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ థియేటర్‌ను పుననిర్మాణం చేపట్టి ‘AVD’ (ఏషియన్ విజయ్ దేవరకొండ) పేరుతో లాంచ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ థియేటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్’ చిత్రంతో ఈ థియేటర్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రంగంలో విజయ్ ఏమేర రాణిస్తాడో చూడాలి.
Also Read: Jathi Ratnalu: బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేసిన జాతిరత్నాలు.. ఎంత వసూల్ చేసిందటే