Nayanthara: నయన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో షేర్ చేసిన విఘ్నేష్.. ఆమె మెరిసే అందం అంటూ..
విఘ్నేష్.. తాజాగా తన సతీమణి నయనతార పాస్ పోస్ట్ సైజ్ ఫోటో షేర్ చేస్తూ.. ఆమె మెరిసే అందం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులకు సరోగసి వివాదంలో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఈ ఇష్యూతో సతమతమవుతున్న ఈ జంటకు ఉపశమనం కల్పించింది తమిళనాడు ప్రభుత్వం. నయన జంట సరోగసి చట్టాల్లు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. దీంతో ఓపికతో ఎదురుచూస్తే మనసుకు ప్రశాంతత ఉంటుందని.. అవాస్తవం వ్యాపించినంత తొందరగా నిజం ప్రచారం కాదంటూ తన మనసులోని మాటలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు విఘ్నేష్. కొద్దిరోజులుగా నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తమ పై వస్తున్న అసత్యపు వార్తలపై పరోక్షంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సరోగసి వివాదం ముగియడంతో మళ్లీ నార్మల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు విఘ్నేష్.. తాజాగా తన సతీమణి నయనతార పాస్ పోస్ట్ సైజ్ ఫోటో షేర్ చేస్తూ.. ఆమె మెరిసే అందం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
నయనతార, విఘ్నేష్ శివన్ తొలిసారిగా నానుమ్ రౌడీ థాన్ సినిమాలో కలిసి పనిచేశారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమకు దారితీసిందట. దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9 ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.





Nayanthara
అయితే అక్టోబర్ 9 తమకు కవలలు జన్మించారంటూ నయన్ జంట ప్రకటించడంతో సరోగసీ వివాదం తెరపైకి వచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. నయన్ పిల్లల జననం.. సరోగసి పద్దతి పై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాము ఆరేళ్ల కిందటే వివాహం చేసుకున్నట్లు ఆధారాలు చూపించింది. అంతేకాకుండా 2020లోనే సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు జన్మినిచ్చేందుకు వైద్యులను సంప్రదించామని తెలిపారు. దీంతో వీరికి సరోగసి వివాదంలో క్లీన్ చీట్ ఇచ్చింది ప్రభుత్వం.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.