Value Of Crore: పాతికేళ్ల తర్వాత కోటి రూపాయల విలువ తెలుసా? ప్రభావితం చేసే అంశాలివే..!
ప్రస్తుత రోజుల్లో కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తంలా అనిపిస్తుంది. ఓ కోటి రూపాయలు ఉంటే సాధారణ మధ్యతరగతి కుటుంబం ఓ సొంత ఇల్లు, కారు కొనుగోలు చేసి సుఖంగా ఉండవచ్చని కోరుకుంటూ ఉంటారు. అయితే దీన్ని దీర్ఘకాలంలో సంపాదించేందుకు ఓ టార్గెట్‌లా పెట్టుకుంటారు. అయితే 25 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడుల ఆధారంగా మీకు కోటి రూపాయలు వస్తే ఆ సమయంలో కోటి రూపాయల విలువ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మీ పెట్టుబడుల ద్వారా కోటి రూపాయలు సమీకరిస్తే మీరు పూర్తిగా ఆర్థికంగా సురక్షితంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే ద్రవ్యోల్బణం మీ ఆశలను అడియాశాలను చేస్తుందని మీకు తెలుసా? ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం మన డబ్బు విలువను కొద్దికొద్దిగా తగ్గిస్తుంది. నేడు లక్ష రూపాయలకు లభించే వస్తువు 15-20 సంవత్సరాల తర్వాత బహుశా 2 నుంచి 3 లక్షల రూపాయలకు లభించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణం రేటు 5 శాతంగా ఉంటే 2050లో కోటి రూపాయల విలువ ఎంత ఉంటుందో? చూద్దాం. మీరు ఎఫ్‌డీ, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ లేదా ఈపీఎఫ్ వంటి పొదుపు పథకాలలో పెట్టుబడి పెడుతుంటే వాటి రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించగలదా లేదా అని చూడాలని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు గత కొన్ని సంవత్సరాలుగా 4 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం రాబోయే 25 సంవత్సరాలకు సగటున 5 శాతం రేటుతో పెరుగుతూ ఉంటే, మీ ప్రస్తుత పొదుపు యొక్క వాస్తవ విలువ క్రమంగా తగ్గుతుంది. 25 సంవత్సరాల తర్వాత మీకు రూ. 1 కోటి లభిస్తే దాని కొనుగోలు శక్తి ఎంత ఉంటుంది? అని ఆలోచించడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట పొదుపు పరికరం ద్వారా ఇచ్చే రాబడి గురించి మనం మాట్లాడేటప్పుడు పెట్టుబడి కాలంలో మీ పొదుపు విలువను క్షీణింపజేసే వాస్తవ ద్రవ్యోల్బణాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. పెట్టుబడి సాధనాలు పోటీ రాబడిని ఇచ్చినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వాటి వాస్తవ దిగుబడి చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం 5 శాతం వద్ద ఉంటే 25 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి వాస్తవ విలువ దాదాపు రూ. 29.36 లక్షలు మాత్రమే ఉంటుంది.
కేవలం కోటి రూపాయలు ఆదా చేయడం సరిపోదని, దాని వాస్తవ విలువను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం, ద్రవ్యోల్బణం కంటే మెరుగైన రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పొదుపుపైనే కాకుండా వృద్ధిపై దృష్టి పెట్టాలని, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌పీఎస్ వంటి ఎంపికలను కూడా పరిగణించాలని పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరైన ఆస్తి కేటాయింపులు చేసుకోవడం ఉత్తమం. మొత్తం డబ్బును ఒకే చోట పెట్టుబడి పెట్టకుండా వివిధ పెట్టుబడి ఎంపికలతో బ్యాలెన్స్ చేయాలి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునేటప్పుడు రాబడిని మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








