లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు సరోగసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట.. అక్టోబర్ 9న తమకు కవల పిల్లలు జన్మించారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో వీరి సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారంటూ తెలుస్తోంది. అయితే ఇలా సరోగసి పద్దతిలో పిలల్లను కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెట్టింది. పెళ్లైన నాలుగు నెలలకే ఇలా సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనడం అనేది వివాదంగా మారింది. నయన్ తీరుపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం పై విచారణ చెప్పట్టింది తమిళనాడు ప్రభుత్వం. పెళ్లైన నాలుగు నెలలకె పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఇష్యూపై విచారణ జరిపిందుకు ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా నయన్ భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఏదో విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో విఘ్నేష్ స్పందిస్తూ.. అన్ని విషయాలను సరైన సమయంలో మీకు తెలుస్తాయి.. అప్పటివరకు ఓపిక పట్టండి అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు “కష్ట సమయంలో ఉన్నప్పుడు మీకు ఏది అవసరమో చెప్పే వ్యక్తుల మాటలను వినండి ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. విఘ్నేష్ చేసిన పోస్ట్ సరోగసి వివాదం గురించే అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. సరోగసి నియంత్రణ చట్టం 2021 డిసెంబర్ లో ఆమోదించబడింది. భారతదేశంలో 2022 జనవరి 25 నుంచి అమలులోకి వచ్చింది. ఇది వాణిజ్య సరోగసిని నిషేధించింది. పరోపకార అద్దె గర్భాన్ని అనుమతిస్తుంది.
అయితే నయన్ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని సమాచారం. ఆమెకు నయనతార సోదరుడితో సన్నిహిత సంబంధాలున్నాయని అందుకే సరోగసికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సరోగసీపై దుబాయ్‌లో ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేవు. ఇప్పుడీ విషయాలే తమకు కలిసొస్తాయని, సరోగసీ కేసులో ఎలాంటి ఇబ్బందులు కలగవని నయనతార దంపతులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే నయన్ గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. అలాగే డైరెక్టర్ అట్లీ… బాలీవుడ్ బాద్ షా కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలోనూ నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.