AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత కసరత్తులు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..!

దివంగత నటి సిల్క్ స్మితను పోలిన ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె రూపం, హావభావాలు సిల్క్ స్మితను గుర్తు చేస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ముఖ కవళికలు, కళ్ల తీరు ప్రముఖ నటి పోలికలను తలపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట విస్తృతంగా చర్చనీయాంశమైంది..

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత కసరత్తులు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..!
Actress Silk Smitha
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 12:03 PM

Share

సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్‌ స్మిత.. ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ ‍అడ్రస్‌. తన నటనతో అప్పట్లో కుర్రాళ్లకు సిల్క్ నిద్రపట్టకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. 1980లలో ట్రెండ్‌గా మారిన క్లబ్‌ డ్యాన్స్‌ పేరు తెచ్చుకున్న సిల్క్ తెరపై కనిపిస్తే చాలు ఈలల మోత మోగిపోయేది. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మెచ్చిన అందం, నటన, డాన్స్ మాత్రం సిల్క్ స్మిత సొంతం. కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటిగా గుర్తింపు పొందిన సిల్క్‌ స్మిత అసలు పేరు విజయ లక్ష్మి. చిన్న, పెద్ద పాత్రలని పట్టింపులేకుండానే సినీ రంగంలో అడుగుపెట్టిన సిల్క్‌.. అనతి కాలంలోనే ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

నిజానికి ఓ నటికి టచప్ గర్ల్‌గా ఉన్న విజయలక్ష్మి (సిల్క్‌ స్మితా)ని నటిని చేసింది నటుడు విను చక్రవర్తి. వండిచక్రం సినిమాలో చిన్న పాత్రతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సిల్క్‌.. ఎన్టీఆర్‌ మూవీ నా దేశం చిత్రంలో నేనొక నెత్తురు దీపం సాంగ్‌తో ఐటెం గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిల్క్‌.. అప్పటి నుంచి దాదాపు టాప్‌ హీరోలందరి సినిమాల్లో తన డ్యాన్స్‌ ఉండాల్సిందే అనేంతలా క్రేజ్‌ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్‌ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్‌ స్మిత వీరితోపోటీపడి తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను దక్కించుకుంది. సిల్క్‌ను ప్రేక్షకులను దగ్గర చేసింది ఆమె కళ్లు, డ్యాన్స్‌ మాత్రమే కాదు హస్కీగా మాట్లాడే విధానం కూడా.

ఇవి కూడా చదవండి

సిల్క్ స్మితకు నటన అంటే మహాఇష్టం. గూండా, ఛాలెంజ్, బాలకృష్ణ ఆదిత్య 369వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. గ్లామర్ పాత్రలు, ప్రత్యేక గీతాలు, క్లబ్ డాన్సుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అయితే సిల్క్‌ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని యావత్‌ సినీ ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. ప్రపంచంలో మనుషుల పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని మనందరం చాలా సార్లు విన్నాం. అదేం నిజమో తెలియదు గానీ.. కొన్ని సార్లు ఊహించని విధంగా మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనేంత ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి అరుదైన దృశ్యం తాజాగా ఓ జిమ్‌లో దర్శనమిచ్చింది. జిమ్‌లో వర్కౌట్‌ చేసేందుకు వచ్చిన ఓ యువతి అచ్చం సిల్క్ స్మితను పోలి ఉండటంతో అక్కడున్న వారంతా తెగ ఆశ్చర్యపడిపోయారు. సిల్క్ స్మితను పోలిన అమ్మాయి (కాస్త బొద్దుగా ఉందిలేండి..) జిమ్‌లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆమె కాస్త సన్నబడితే అచ్చం స్మితలాగే ఉంటుందేమో అనేంతగా పోలికలు కలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us