Mrunal Thakur: జిమ్‌లో చమట్లు చిందిస్తూనే అందాలు ఆరబోసిందిగా.. మంటలు రేపుతోన్న మృణాల్

|

Jun 04, 2023 | 9:41 AM

సెలెక్ట్‌డ్‌గా కథలను ఎంచుకుంటూ.. తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకుంటూపోతోంది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై మెరిసి.. ఇప్పుడు వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది.

Mrunal Thakur: జిమ్‌లో చమట్లు చిందిస్తూనే అందాలు ఆరబోసిందిగా.. మంటలు రేపుతోన్న మృణాల్
Mrunal Thakur
Follow us on

మృణాల్ ఠాకూర్.. కేవలం ఒక్క సినిమాతో తెలుగునాట ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. అందంతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. మొదట నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ అందాల భామ.. ఇప్పుడు అందంతో ఫ్యాన్స్‌ను చంపేస్తోంది. సెలెక్ట్‌డ్‌గా కథలను ఎంచుకుంటూ.. తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకుంటూపోతోంది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరపై మెరిసి.. ఇప్పుడు వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ‘సూపర్ 30’, ‘ధమాకా’, ‘జెర్సీ’ లాంటి చిత్రాలతో హిందీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

‘సీతారామం’తో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్.. తొలి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ సరసన ఓ చిన్న పాత్ర చేసి.. తనలోని గ్లామర్ టచ్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది.

సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా మృణాల్ జిమ్ లో కష్టపడుతోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిమ్ లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తూనే అందాలు ఆరబోసింది ఈ భామ. ఇక మృణాల్ ఇప్పుడు నాని 30 లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మృణాల్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి.