ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆమెను వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… స్వల్పంగా కోలుకుంటున్నట్లుగా వైద్యులు తెలిపారు. లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమెను ఇంకా ఐసీయూలో ఉంచాం. ప్రస్తుతం స్వల్పంగా ఆమె కోలుకుంటున్నారు అని తెలిపారు.
92 ఏళ్ల లతా మంగేష్కర్ గత రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గతంలో 2019 నవంబర్ లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆమెకు ఐరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు లతా మంగేష్కర్ చెల్లెలు ఉష తెలిపింది.
Singer Lata Mangeshkar is still in the ICU ward but there has been a slight improvement in her health: Dr Pratit Samdani
(File Pic) pic.twitter.com/kggGghjqHt
— ANI (@ANI) January 13, 2022
1942లో 13 ఏళ్ల వయసులో లతా మంగేష్కర్ తన కెరీర్ ప్రారంభించారు. ఏడు దశాబ్దాల కెరీర్ లో 50వేలకుపైగా పాటలను పాడారు. లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు . ఇండియన్ నైటింగల్‌గా పేరు సంపాదించారు.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హతో ఆసక్తికరమైన వీడియో..
Teaser Talk: అసలు మనిషి చర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హన్సిక కొత్త సినిమా టీజర్..
Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..