Pavitra Lokesh: నరేశ్‌తో పెళ్లి వార్తలపై పవిత్రా లోకేష్ నుంచి రెస్పాన్స్.. ఊహించని విధంగా

|

Jun 30, 2022 | 3:07 PM

సీనియర్​ నటి పవిత్రా లోకేష్​ వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్​మీడియాలో రూమర్స్​ విపరీతంగా వస్తున్నాయి. ఆమె సీనియర్​ నటుడు నరేశ్​ను​ పెళ్లి చేసుకోబోతుందంటూ కథనాలు వస్తున్నాయి. వాటిపై ఆమె తాజాగా రెస్పాండ్ అయ్యారు.

Pavitra Lokesh: నరేశ్‌తో పెళ్లి వార్తలపై పవిత్రా లోకేష్ నుంచి రెస్పాన్స్.. ఊహించని విధంగా
Pavitra Lokesh
Follow us on

Tollywood: సీనియర్​ నటి పవిత్రా లోకేష్​ గురించి ఇప్పుడు నెట్టింట వార్తలు తెగ సర్కులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె సీనియర్ నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్‌(VK Naresh)ను మ్యారేజ్ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు కాస్తా శృతి మించడంతో పవిత్ర లోకేష్ సీరియస్ అయ్యారు. ఆకతాయులకు మాటలతో చెప్పకుండా డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగిపోయారు. ఈ క్రమంలోనే  కర్ణాటక(Karnataka)లోని సైబర్​ పోలీసులను అప్రోచ్ అయ్యారు. కొందరు తన పేరుతో ఫేక్​ అకౌంట్స్​ను క్రియేట్​ చేసి, అసభ్యకరమైన పోస్ట్​లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసిన తన నేమ్ అండ్ ఫేమ్‌ను చెడగొడుతున్నారని కంఫ్లైంట్‌లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన పవిత్రా లోకేష్​..  ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు . ఈమె తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు మైసూర్ లోకేష్‌. పవిత్ర భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్‌, సోదరుడు ఆది లోకేష్ కూడా క‌న్న‌డ‌లో న‌టులు. ప్రస్తుతం తెలుగులో పలువురు స్టార్​ హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా నటిస్తున్న ఆమె.. కొంతకాలం క్రితం తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు.  కాగా అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు సినిమా వాళ్లపై సర్కులేట్ చేస్తూనే ఉంటారు కొందరు ఆకతాయిలు. ప్రారంభంలోనే రెస్పాండ్ అయి.. వాటిని కొట్టిపారిస్తే ఇంతదూరం వచ్చే అవకాశం ఉండదు అన్నది ఫిల్మ్ సర్కిల్ నుంచి వినిపిస్తున్న మాట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి