Balagam: బలగం సినిమాకు ప్రియదర్శి కంటే ముందు ఆ నటుడిని అనుకున్నారట

నటుడు వేణు టిల్లు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు.

Balagam: బలగం సినిమాకు ప్రియదర్శి కంటే ముందు ఆ నటుడిని అనుకున్నారట
Balagam

Updated on: Mar 29, 2023 | 7:55 AM

ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయాలను అందుకుంటున్నాయి సినిమాలు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా బలగం. నటుడు వేణు టిల్లు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ గా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు వేణు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆ ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో నటించారు ప్రియదర్శి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. దిల్ రాజు ఫోన్ చేసి వేణు ఒక కథ చెప్తాడు విను అని అన్నారట. వేణు చెప్పిన కథ విపరీతంగా నచ్చి వెంటనే ఓకే చేసేసా అని అన్నాడు ప్రియదర్శి.

అలాగే ఈ సినిమాలో సాయిలు పాత్ర మొదట వేణునే చేద్దాం అనుకున్నారట.. కానీ ఆ తర్వాత ప్రియదర్శిని ఎపిక చేశారట. ఆ పాత్ర వేణు చేసుంటే నేను మంచి సినిమాను మిస్ అయ్యేవాడిని అని అన్నారు ప్రియదర్శి. ఇక బలగం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. పలు థియేటర్స్ లోనూ రన్ అవుతుంది. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.Venu