Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వేణు స్వామి భార్య.. వీణ శ్రీవాణి స్పెషల్ పెర్ఫామెన్స్ చూశారా?

|

Jul 13, 2024 | 10:24 AM

వివాహ వేడుకల కోసం వచ్చిన అతిథులను అలరించేందుకు దేశ విదేశాల నుంచి జస్టిన్ బీబర్ లాంటి ఫేమస్ సింగర్లు, డ్యాన్సర్లను రప్పించింది అంబానీ ఫ్యామిలీ. కాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సతీమణి వీణశ్రీవాణి కూడా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. వీణ వాయించడంలో తన దైన గుర్తింపు తెచ్చుకున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోనూ స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు.

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వేణు స్వామి భార్య.. వీణ శ్రీవాణి స్పెషల్ పెర్ఫామెన్స్ చూశారా?
Anant Ambani Wedding
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి వేడుకల గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం (జులై 12) రాత్రి రాధికా మర్చంట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అనంత్ అంబానీ. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వివాహ వేడుకలు హజరయ్యారు. కాగా వివాహ వేడుకల కోసం వచ్చిన అతిథులను అలరించేందుకు దేశ విదేశాల నుంచి జస్టిన్ బీబర్ లాంటి ఫేమస్ సింగర్లు, డ్యాన్సర్లను రప్పించింది అంబానీ ఫ్యామిలీ. కాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సతీమణి వీణశ్రీవాణి కూడా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. వీణ వాయించడంలో తన దైన గుర్తింపు తెచ్చుకున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోనూ స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరైన ఈ పెళ్లి వేడుకులో నాకు వీణ వాయించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. తెలుగు వారి తరఫున వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. వారు మా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు వారి సంప్రదాయాన్ని రిప్రెజెంట్‌ చేయాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు కూడా నా డ్రెస్, కాస్ట్యూమ్ ను సెలక్ట్‌ చేశారు. అంబానీ కుటుంబం నన్ను చాలా బాగా చూసుకుంది. వారు నాకు ఎంతో గౌరవమిచ్చారు. ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకున్నారు’ అని చెప్పుకొచచింది వీణా శ్రీవాణి.

 

ఇవి కూడా చదవండి

వేణు స్వామి పుణ్యమా అని ఆయన భార్య వేణు శ్రీవాణి కూడా బాగానే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీణపై తీయటి స్వరాలు పలికిస్తూ నవ్వుతూ కనిపించే ఆమె ప్రతిభకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

అంబానీ పెళ్లి వేడుకల్లో వీణా శ్రీవాణి ప్రదర్శన..

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణపై వాయించడం వాణి శ్రీవాణి ప్రత్యేకత. అంతేకాదు తన ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వీటికి నెటిజన్లు నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంటుంది. అలా ఇప్పుడు ఏకంగా అంబానీ పెళ్లి వేడుకలో వీణ వాయించి అందరి దృష్టిని ఆకర్షించారు వీణ శ్రీవాణి.

అంబానీ పెళ్లి వేడుకల్లో వీణా శ్రీవాణి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.