మెగా హీరో వరుణ్ తేజ్ హీరో నటించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు వెంకీ అట్లూరి. అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ ,ఆతర్వాత అఖిల్ అక్కినేని తో సినిమా చేసాడు. మిస్టర్ మజ్ను అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ.. నితిన్ తో రంగ్ దే సినిమా చేసాడు.కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సన్తం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ ఓ సీనియర్ హీరోతో సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. వెంకీ అట్లూరి ఈ సారి యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో ఒక సినిమా చేయడానికి బాలకృష్ణ ఓకే చెప్పారట. దాంతో వారు వెంకీ అట్లూరితో కథను సిద్ధం చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒక వేళా ఈ వార్త నిజమైతే ఈ కుర్ర దర్శకుడి సుడి తిరిగినట్టే.. బోయపాటి సినిమా తరువాత బాలయ్యతో సినిమాలు చేయడానికి గోపీచంద్ మలినేని .. అనిల్ రావిపూడి .. శ్రీవాస్ లైన్లో ఉన్నారు. ఆ తరువాతనే వెంకీ అట్లూరి వంతు రానుంది. ఇక బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ సినిమా కోసం బాలయ్య అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ సినిమా పై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :