
డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబో మ్యాజిక్ మరోసారి హిట్టయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం మూడు రోజుల్లోనే 106 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని.. ఎనీ సెటంర్ సింగిల్ హ్యాండ్ అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజే రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం వెంకీ కెరీర్ లోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా.. మూడో రోజు మొత్తం రూ.29 కోట్లు కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెంకీ మామ కామెడీతోపాటు బుల్లిరాజు యాక్టింగ్ మెయిన్ హైలెట్ అయ్యింది. సినిమా విడుదల వరకు అంతగా వినిపించని బుల్లిరాజు పాత్ర పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.250 కోట్ల గ్రాస్ రాబట్టేలా కనిపిస్తుంది.
Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥
106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥
The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥
— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR
— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..