టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేశ్ మహా వివాదాలతో సహవాసం చేస్తున్నాడు. ఇటీవల కొంత మంది దర్శకులతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను కేజీఎఫ్ సినిమాపై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. నీచ్ కమీన్ కుత్తే అంటూ అసభ్య పదజాలంతో వెంకటేశ్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. వెంకటేశ్ మహా వ్యాఖ్యలకు నొచ్చుకున్న యశ్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అయినా ఈ యంగ్ డైరెక్టర్ అసలు తగ్గట్లేదు. తాను వాడిన పదజాలం కరెక్టు కాకపోవచ్చేమో కానీ కేజీఎఫ్ సినిమాపై తన అభిప్రాయం మాత్రం మారదన్నాడు. ఇలా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారిన వెంకటేశ్ మహా తాజాగా మరో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ మహా కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘యాంగర్ టేల్స్’. ఆయనతో పాటు బిగ్‌బాస్ ఫేం బిందు మాధవి, సుహాస్, మడోనా సెబాస్టియన్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇవాళ (మార్చి 9) అర్ధరాత్రి నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
యాంగర్ టేల్స్‌లో తన పాత్రకు సంబంధించి తాజాగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు వెంకటేశ్ మహా. ‘నేను ఇందులో ‘రంగా’ అనే పాత్రలో యాక్ట్ చేశాను. రంగా పాత్రకు కథానసారంగా 18 ఏళ్లలోపు వయసువారికి తగని భాష వాడారు. ఈ ఎపిసోడ్ చూసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాను. కానీ మిగిలిన 3 ఎపిసోడ్లు ‘రాధ, గిరి, పూజ’లను కుటుంబ సమేతంగా చూసి ఆనందించొచ్చు’ అని పేర్కొన్నాడు. తద్వారా తన సిరీస్‌లో బూతులు ఎక్కువగానే ఉన్నాయని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడీ యంగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. ఈ సిరీస్‌కు ప్రభల తిలక్ దర్శకత్వం వహించాడు.
#AngerTalesOnHotstar
March 9th onwards@tilakprabhala @ActorSuhas @RavindraVijay1 @thebindumadhavi @phanindracharya @TharunBhasckerD @SridharBobbala @MadonnaSebast14 @amardeepguttula @VinodBangari2 @Kalyankodati @smaransai pic.twitter.com/lS5E9QFgOU— Venkatesh Maha (@mahaisnotanoun) March 8, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..