
సీనియర్ హీరో వెంకటేష్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన చేయని పాత్రలు లేవు అనే చెప్పాలి. యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు వెంకీ.. అంతే కాదు కుర్రహీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అందరు యంగ్ హీరోలతో వెంకటేష్ కలిసి నటించారు. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు వెంకీ. రానా తో కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సిరీస్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు తండ్రి కూతురు మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.
తాజాగా సైంధవ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ టీజర్ తర్వాత మరో గణేష్ సినిమాల ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ టీజర్ లో ముందుగా తండ్రి , కూతురు మధ్య ప్రేమ చూపించారు. ఆ తర్వాత పిల్లలకు గన్స్ ఇచ్చి వారిని టెర్రరిస్ట్ లుగా మారుస్తోన్న ఓ గ్యాంగ్ ను చూపించారు. ఇక వెంకటేష్ విలన్స్ కు వార్నింగ్ ఇవ్వడం చూపించారు. అసలు వెంకటేష్ కు ఆ గ్యాంగ్ కు ఉన్న సంబంధం ఏంటి అన్నది ఆస్కతికరంగా మారింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.