విక్టరీ వెంకటేశ్.. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రధాన పాత్రలలో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ సినిమా ఎఫ్ 3. ఈ ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. గతంలో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న ఎఫ్ 3 (F3 Movie) సినిమా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుందని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు మేకర్స్. అలాగే ఈ ఎఫ్ 3 సినిమా పూర్తిగా డబ్బు గురించిన నేపథ్యంలో ఉండనుందని పోస్టర్స్‌తో హింట్ ఇచ్చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం కూడా ఉంది.. అదే డబ్బు అంటూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కామెడీ టైమింగ్ బాగుంది. ట్రైలర్ విజువల్స్ అండ్ టేకింగ్ బాగుంది. మనీ.. ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్టేషన్ అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తిగా కామెడీ ఎలిమెంట్స్‌తో రీలిజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో మరింత వినోదాన్ని అందించడానికి సమ్మర్ సోగాళ్లు రాబోతున్నారని.. ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..
NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..